మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) కొద్దిసేపటి క్రితం పదవ తరగతి పరీక్ష ఫలితాలు(TS SSC Results) విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను చాలా కలచివేస్తోందన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని విద్యార్థులను కోరారు.
TS SSC Results |విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, కాబట్టి వెనకబడతామనే ఆందోళన వద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మనోధైర్యాన్ని ఇచ్చి మద్దతుగా నిలవాలి అన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన వారికి జూన్ 14 నుంచి జూన్ 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. మే 26 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని ఆమె తెలిపారు.
టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
http://results.bse.telangana.gov.in/
Read Also: 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి
Follow us on: Google News, Koo, Twitter