అధికార బీఆర్ఎస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. తానే కొంటా అని చెప్పిన ఎమ్మెల్యే షకీల్(MLA Shakeel).. 20 రోజులుగా కనిపించడం లేదంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీజేపీ బోధన్ నియోజకవర్గం పేరిట రెండు రకాల పోస్టర్లు వెలిశాయి. ‘జాడలేని బోధన్ ఎమ్మెల్యే షకీల్.. వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటానని జాడ లేకుండా పోయినవ్. చెప్పిన నాటి నుంచి ఇప్పటి దాకా గింజకూడా ధాన్యం కొనలే. ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని ప్రతి గింజ ధాన్యం కొనాల్సిందే’ అపి పోస్టర్లలో రాసుకొచ్చారు.
Read Also: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: MLA
Follow us on: Google News, Koo, Twitter