కేసీఆర్-అమిత్ షా చీకటి ఒప్పందం.. త్వరలో గజ్వేల్‌లో ఏర్పాటు!

-

బీఆర్ఎస్, బీజేపీ నేతలపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ఎదుట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఢిల్లీలో కలిసి పనిచేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేలా చక్కగా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో అమిత్ షా(Amit Shah) సహకార శాఖ మంత్రి కూడా అవుతారని, అమిత్ షా ఆదేశాలతో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ అనే పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఐటీశాఖ మంత్రి ఆమోదం తెలిపారని, ఈ విషయం మంత్రి తలసాని వంటి వారికి తెలియదని సెటైర్లతో తీవ్రంగా విమర్శించారు. ఇదే కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న నందిని అనే పాల కంపెనీని మూసియాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడి అమూల్ కంపెనీని రానివ్వలేదని తెలిపారు. తెలంగాణలో మాత్రం సీఎం తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లోని వర్గల్‌లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించారన్నారు. తెలంగాణ రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు చెందిన విజయ పాల కంపెనీకి ప్రభుత్వం గత రెండేళ్లుగా కనీసం ఎండీని కూడా ఎందుకు నియమించలేదని ఆర్ఎస్పీ(RS Praveen Kumar) నిలదీశారు. రావిర్యాల ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు.

- Advertisement -
Read Also: తాడేపలి సీఎం క్యాంపు కార్యాలయంలో అంబటి రాయుడు.. వైసీపీలోకి పక్కా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...