పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

-

పార్టీ పెట్టి సీఎం అవ్వడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్నంత ఈజీ కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్(Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు, సీఎం అభ్యర్థి విషయంపై పవన్ చేసిన కామెంట్లపై విమర్శల వర్షం కురిపించారు. పార్టీని నదపలేనని పవన్ చేతులు ఎత్తేశారని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ జెండా మోయడమే ఆయన పని అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు అదే నిజమైందన్నారు. సినిమా రంగంలో ఉండకుండా.. నీకెందుకు రాజకీయాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాత్రం దానికి పార్టీ పెట్టి నాయకులు, ప్రజలను మోసం చేయడం ఎందుకు అని గుడివాడ(Gudivada Amarnath) నిలదీశారు.

- Advertisement -
Read Also: ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేస్తాయి: పవన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...