దేశంలోనే నెంబర్ 2లో నిలిచిన సోమాజిగూడ ఏరియా

-

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ సిరలో మరో ఖ్యాతి చేరింది. దేశంలోని అన్ని మహానగరాల్లో మెరుగైన షాపింగ్‌ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్‌ మార్కెట్లలో సోమాజిగూడ(Somajiguda) రెండో స్థానం దక్కించుకుంది. బెంగళూరులోని మహాత్మాగాంధీ రోడ్డు తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఓ నివేదికలో పేర్కొంది. థింక్‌ ఇండియా థింక్‌ రిటైల్‌-2023 హైస్ట్రీట్‌ రియల్‌ ఎస్టేట్‌ ఔట్‌లుక్‌ పేరుతో ఏడు మెట్రో నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

- Advertisement -

షాపింగ్‌ చేసేందుకు సోమాజిగూడ(Somajiguda) అత్యంత అనుకూలంగా ఉందని.. కొనుగోలుదారులకు స్థానిక వ్యాపారులు కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని నివేదికలో తెలిపింది. ఈ ఏరియాలో కొనుగోలుదారుల నుంచి స్పందన రావడంతో పాటు వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నట్లు పేర్కొంది. అత్యంత మెరుగైన షాపింగ్ అనుభూతి కలిగించే వీధులనే హైస్ట్రీట్‌లుగా గుర్తిస్తారని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది.

Read Also: సోమేష్ కుమార్‌కు పదవిపై షర్మిల పరోక్ష విమర్శలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మొహమ్మద్’ పేరు నచ్చక.. గొంతు నులిమి చంపేశాడు!

Alltimereport : 'మొహమ్మద్' అనే పేరు నచ్చకపోవడంతో ఉబెర్ డ్రైవర్‌(Uber Driver)పై...

హిస్టరీలో ఫస్ట్ టైమ్.. రష్యా భారీ డిఫెన్స్ బడ్జెట్ ఆమోదం

Alltimereport : ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...