కర్ణాటకలో మా ఓటు శాతం తగ్గలేదు: డీకే అరుణ

-

కర్ణాటక ఫలితాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి 104 సీట్లలో విజయం సాధించిన బీజేపీ(BJP) ఈ ఎన్నికల్లోనూ 36 శాతానికి పైగా ఓట్లు సాధించిందన్నారు. అయితే మెజారిటీ సీట్లు గెలవడంలో మాత్రం తాము వెనుకబడినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్.. ఈ ఎన్నికల్లో 12 శాతమే ఓట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అనేక స్థానాల్లో జేడీఎస్(JDS) పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు రావడం వల్లే ఈ 5 శాతం అదనపు ఓట్ షేర్ కాంగ్రెస్ కు సాధ్యమైందని ఆమె(DK Aruna) ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల చివరి దశలో ఎంఐఎం, ఎస్డీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను విరమించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లేందుకు కృషి చేశాయని, కాబట్టే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం, సీట్ల శాతం పెరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...