పేదలను మోసం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఆర్5 జోన్(R5 Zone) అంశం తెరపైకి తెచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విమర్శించారు. రైతులు, పేదలకు మధ్య ఘర్షణలు సృష్టించేందుకే సీఎం జగన్ ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఆర్5జోన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు, విద్యుత్ కోతలు, వివేకా హత్య కేసు తదితర అంశాలపై చర్చించారు. టీడీపీ ప్రభుత్వంలో CRDA ప్రణాళికలోనే పేదలకు 5శాతం భూమిని రిజర్వ్ చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు ఆర్5 జోన్ పేరుతో జగన్(Jagan) సర్కార్ రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అలాగే న్యాయస్థానాల్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వాదించే న్యాయవాదులకే ప్రభుత్వ కేసులు అప్పగిస్తూ ప్రజాధనం దోచిపెడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
Read Also: ఈ చెట్టు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter