ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన కేసీఆర్(KCR) ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ప్రభుత్వాలు భూమిలేని పేదవాడికి భూమి పంచితే నేటి ప్రభుత్వం భూములను లాక్కోవడం దివాలా కోరుతనానికి నిదర్శనం. ఇప్పటికే ప్రాజెక్టుల పేరు మీద, రోడ్ల వెడల్పు పేరు మీద, ఇండ్ల పేరు మీద అసైన్డ్ భూములను పేదవాడి నుంచి దూరం చేస్తున్నారు. పేదవాడికి భూమి లేకుండానే ఉండాలా?? ప్రభుత్వ భూములను అమ్మి స్కీములు అమలు చేయడం గొప్పనా??’’ అని బీఆర్ఎస్(BRS) సర్కార్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: ఆ నలుగురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter