తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులను ఈ ఉత్సవాల్లో భాగం చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) తెలిపారు. పదేళ్ల కాలంలో చేపట్టిన పథకాలు, వాటి ద్వారా చేకూరిన ప్రయోజనాలను చాటిచెప్పేలా ఉత్సవాలు జరుగుతాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుండి వెన్నంటి ఉండి, నేడు అబివృద్దిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు తన తండ్రి చెప్పిన మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అవి పాటిస్తున్నాను కాబట్టే అధినేత కేసీఆర్(KCR) దగ్గర చనువుగా నమ్మకంగా మెదిలే అవకాశం, కార్యకర్తలకు కుటుంబ సభ్యునిగా మెదిలే అవకాశం సాధ్యమయ్యిందని అన్నారు మంత్రి వేముల(Prashanth Reddy). బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పని చేసిన వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని అన్నారు.
Read Also: మళ్లీ చెలామణిలోకి రూ.1000 నోటు?
Follow us on: Google News, Koo, Twitter