కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మరోసారి విమర్శలు చేశారు. ఆదివారం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారని సెటైర్లు వేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేటి పాలకులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ(BJP), రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, తెలంగాణలోనూ ఇద్దరికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఎవరు ఎంత కూసినా తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు నేతలు, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ భావజాలం నమ్మిన వాళ్లంతా మళ్లీ పార్టీలోకి రావాలని భట్టి(Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడుతూ.. సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామని ప్రజలకు క్లియర్‌గా వివరించాలని నేతలకు సూచించారు.
Read Also: గుడ్ న్యూస్: రూ.2 వేల నోట్ల మార్పిడిపై SBI క్లారిటీ
Follow us on: Google News, Koo, Twitter