రామబాణం, ఖిలాడి చిత్రాల హీరోయిన్, ఐటం గర్ల్ డింపుల్ హయతి(Dimple Hayathi) ఐపీఎస్ అధికారితో ఘర్షణకు దిగింది. పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్ కాబోయే భర్త డేవిడ్ ఢీ కొట్టాడు. దీనిపై రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ ప్రశ్నించగా.. కారును కాలితో తంతూ నానా రచ్చ చేసింది. దీంతో డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారిద్దరిపై ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే దురుసుగా ప్రవర్తించిందని రాహుల్ తెలిపారు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు పేర్కొన్నారు. కాగా జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్‌లో నటి హయతి(Dimple Hayathi), ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు.
Read Also:
1. బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి
2. శృంగారంలో మహిళలకు మూడ్ తెప్పించే 5 టచ్ లు!
Follow us on: Google News, Koo, Twitter