వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

-

WTC Prize Money |వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్‌‌కు భారత్, ఆస్ట్రేలియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. జూన్ 7 నుంచి 11వ తేదీల మధ్య లండన్‌‌లోని ఓవల్ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. మొత్తం 9 జట్లకుగానూ టోర్నీ ప్రైజ్‌మనీ(WTC Prize Money) 3.8 మిలియన్ డాలర్లు(దాదాపుగా రూ. 31.38 కోట్లు)గా వెల్లడించింది. అయితే, ప్రారంభ ఎడిషన్ 2019-21‌‌లో కూడా ప్రైజ్‌మనీ 3.8 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ సారి ఆ మొత్తాన్ని పెంచకపోవడం గమనార్హం. విజేతగా నిలిచిన జట్టుకు రూ.13.23 కోట్లు దక్కనుండగా.. రన్నరప్‌ జట్టు రూ. 6.61 కోట్లు అందుకుంటుంది. అలాగే, మూడో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికా 450 డాలర్లు, 4వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 350 డాలర్లు, 5వ స్థానంతో సరిపెట్టిన శ్రీలంక 200 డాలర్లు అందుకోనుండగా.. చివరి నాలుగు స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకు 100 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది.

- Advertisement -
Read Also:
1. రూ.2 వేల నోట్లు మార్చాలా.. పాతబస్తి వ్యక్తి వినూత్న నిర్ణయం!
2. శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...