పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం

-

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట సమీపంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) షూటింగ్ సెట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హమారా దాబా ఎదురుగా గతంలో పవన్ కల్యాణ్ మూవీ కోసం సెట్ వేశారు. దానిని తాజాగా తొలగించేందుకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో ధర్మా కోల్ అంటుకొని అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Read Also:
1. తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్: Pawan Kalyan
2. చాణక్య నీతి: భార్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...