కొత్త పార్లమెంట్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

-

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని వెల్లడించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన అనంతరం తొలి సారి సభ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. పాత పార్లమెంట్ లో తగినన్ని సీట్లు లేవని, అక్కడ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్ లో ఎంపీల సంఖ్య పెరగాల్సి ఉందని పాత పార్లమెంట్ లో కొత్త ఎంపీలకు కూర్చునేందుకు తగినంత స్థలం లేదన్నారు. అందుకే కొత్త పార్లమెంట్ ను రికార్డు టైమ్ లో నిర్మించామని చెప్పారు. నిజానికి పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చర్చ ఉంది. నింబంధనల ప్రకారం పార్లమెంట్ స్థానాల సంఖ్య 2026 తర్వాత కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ గడువును కాస్త ముందుకు జరిపేలా రాజ్యాంగ సవరణ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేమి కాదని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే అది సాధ్యమే అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానాలను 1000కి పెంచాలనే డిమాండ్లు దేశంలోని రాజకీయ ప్రముఖుల నుండి వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని(PM Modi) నోటి వెంట లోక్ సభ సీట్ల పెంపు అంశం ప్రస్తావనకు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కొత్త పార్లమెంట్ భవనాన్ని అన్ని హంగులతో 1272 మంది కూర్చునే కెపాసిటీతో నిర్మించారు.

Read Also: 
1. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఏఈఈ అభ్యర్థి.. అధికారులు షాక్!
2. పార్లమెంట్ వద్ద హైటెన్షన్.. పోలీసుల అదుపులో సాక్షి మాలిక్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...