Congress Manifesto | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

-

లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసింది. ‘ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు’ పేరుతో దీనిని రూపొందించింది. రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని గాంధీ భవన్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. మొత్తం 23 హామీలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.

- Advertisement -

Congress Manifesto లోని హామీలు ఇవే..

హైదరాబాద్- బెంగళూరు మధ్య ఐటీ, పారిశ్రామిక కారిడార్
హైదరాబాద్-నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్
హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ITIR ప్రాజెక్ట్ పున: ప్రారంభం
రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT)
ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IISER) ఏర్పాటు
హైదరాబాద్‌లో IIM ఏర్పాటు
ఏపీలో కలిపిన 5 గ్రామాలు మళ్లీ తెలంగాణకు తీసుకొస్తాం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా
సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా
హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం
రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం
నాలుగు కొత్త సైనిక్ స్కూళ్లు
కేంద్రీయ విద్యాలయాల రెట్టింపు
నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
రాష్ట్రానికి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఆధ్వర్యంలో వైద్య పరిశోధన సంస్థ
హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ
సర్పంచులకు నేరుగా కేంద్రం నిధులు
ప్రతి ఇంటికీ సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ

Read Also: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...