నటుడు నరేష్(VK Naresh), పవిత్ర(Pavitra Lokesh)తో పిల్లల్ని కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరూ ఫిట్‌గా ఉన్నామని పిల్లల్ని కనొచ్చని చెప్పి అందరికీ షాకిచ్చాడు. రీసెంట్‌గా ‘మళ్ళీ పెళ్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరేష్(VK Naresh), పవిత్ర జంట ప్రేక్షకుల నుండి మిక్స్డ్ ఒపీనియన్స్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. పవిత్రతో పిల్లల్ని కనడంపై బోల్డ్ కామెంట్స్ చేసాడు. ‘‘నేను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నాం, ఇప్పటికీ మేము మెడికల్‌గా పిల్లలను కనొచ్చు. కానీ ఇప్పుడు మేం పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చే సరికి పిల్లలకు 20 ఏళ్లు వస్తాయి. అందంతా అవసరమా? భార్యభర్తలుగా మాత్రం మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. నా దృష్టిలో బ్లడ్ రిలేషన్‌షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది.’’ అని చెప్పుకొచ్చాడు.
పవిత్ర, నేను శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నాం.. పిల్లల్ని కనొచ్చు: నరేష్
-