ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా జరుగుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విచ్చేశారు. ఈ సందర్భంగా బన్నీ తనకు సంబంధించిన వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. కంటెస్టెంట్ శ్రుతి పాట పాడాక ‘నీ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే’ అని తెలిపారు. అనంతరం తన తండ్రి అల్లు అరవింద్(Allu Arvind) గురించి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. తనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ ఇచ్చిన మా నాన్నే నాకు దేవుడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ‘పుష్ప’ సినిమాలో కేశవ్‌గా అలరించిన నటుడు జగదీశ్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. హీరోగా ‘సత్తి గాని రెండెకరాలు’ చేశావ్ కదా.. అలా అని ‘పుష్ప2’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని అంటే కుదరదని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు బన్నీ(Allu Arjun).