జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలక నేత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలు… సార్వత్రికి ఎన్నికలకు సంవత్సరం సమయం ఉన్న సమయంలో అద్దేపల్లి శ్రీధర్ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు…
ఇక ఫలితాలు వెలుబడుతాయన్న మూడు రోజుల ముందు ఆయన జనసేనకు రాజీనామా చేశారు.. అప్పటినుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు… ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ సంక్షమ పథకాలను అమలు చేస్తున్న విధానాలను చూసి ఆయన ఆకర్షితులు అయ్యారు..
దీంతో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు… వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్యకారణాలవల్ల అద్దేపల్లి శ్రీధర్ సజ్జల సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…