తెలంగాణ ఆవిర్భావ వేడులకను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. కిషన్ రెడ్డి తీరుపై హర్యానా గవర్నర్ దత్తాత్రేయ(Bandaru Dattatreya) అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన దత్తాత్రేయ(Bandaru Dattatreya).. తాను హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసి కూడా తనను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో తాను చుకురుగా పాల్గొన్నానని తాను ఓ ఉద్యమకారుడినే కాక ప్రస్తుతం ఓ రాష్ట్రానికి గవర్నర్గా హోదాలో ఉన్న వ్యక్తినని అన్నారు. అలాంటిది తనను గుర్తించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గవర్నర్ దత్తాత్రేయ సీరియస్!
-