బొత్సకు అచ్చెన్నాయుడు దారుణమైన కౌంటర్

బొత్సకు అచ్చెన్నాయుడు దారుణమైన కౌంటర్

0
73

అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, వాటిని అధికార పార్టీ ఖండించడం తెలిసిందే. అయితే గత తెలుగుదేశం పాలన నుంచి వైసీపీ పై టీడీపీ విమర్శలు చేసేది. అలాగే టీడీపీ పై వైసీపీ విమర్శలు చేసేది.. ఈ అసహనం కుటుంబాల మీదకు అలాగే వ్యక్తిగత ఆరోపణకు బీజం వేసింది అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నారాలోకేష్ పై కూడా వ్యక్తిగత విమర్శలు వైసీపీ చేసేది. అలాగే వైసీపీ అధినేత జగన్ పై, భార్య భారతి పై, సోదరి షర్మిలపై విమర్శలు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చినా ఈ విమర్శలు ఆరోపణలు టార్గెట్ వయా కుటుంబం అనేలా జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు ఏకంగా నేతల మధ్య కూడా ఈ కల్చర్ పెరిగింది అని చెప్పాలి, తాజాగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక లేదంటూ మంత్రి బొత్స ఒక జోకర్గా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో ఉత్తరాంధ్రా నేతల మధ్య ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయింది ఈ కామెంట్.. నేడు టీడీపీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించి వైసీపీని వాష్ అవుట్ చేసింది.

అమరావతిలో శాసన సభ్యులకు 280 ప్లాట్లు సిద్ధం అయ్యాయని . జగన్ సొంత ఇంటి కంటే క్వాలిటీగా నిర్మాణాలు ఉన్నాయని. 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను.. శాడిస్ట్ ఆలోచనతో ఆపేశారని అచ్చెన్న విమర్శించారు. మొత్తానికి అచ్చెన్న బొత్స కామెంట్లు అమరావతిలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.