ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్(Hazlewood) ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌లో గాయం తిరగబెట్టడంతో అతను టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి స్థానాన్ని ఆల్‌రౌండర్ మైఖేల్ నసెర్ భర్తీ చేయనున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల అనుభవం ఉన్న నసెర్ ఈ మధ్య అద్భుతంగా రాణించాడు. యార్క్‌షైర్ జట్టుపై అతను 732తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే.. తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా? లేదా? అనేది తెలియదు. ఎందుకంటే.. భారత పర్యటనలో ఆకట్టుకున్న స్కాట్ బోలాండ్ రేసులో ఉన్నాడు. అతను ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయగలడు. దాంతో, కోచ్ మెక్‌డొనాల్డ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడికి అవకాశం ఇచ్చే అవకాశం లేకపోలేదు.