Yuvagalam |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటికే 1500 కిలోమీటర్లు దాటిన ఈ యాత్ర త్వరలోనే 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా లోకేశ్‌పై అభిమాన్ని బ్రిటన్ ఎన్నారై యువకులు వినూత్నంగా చాటుకున్నారు. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో యూకే తెలుగు యువత సభ్యులు మైదానంలో యువగళం(Yuvagalam) జెండాలు పట్టుకుని సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌కు సంఘీభావం తెలిపారు. అనంతరం జై లోకేశ్, జై బాబు, జై టీడీపీ, జోహార్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వీరిని మ్యాచ్ కెమెరామెన్లు ప్రత్యేకంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లోకేశ్‌పై అభిమానంతో WTC ఫైనల్ మ్యాచ్‌లో యువగళం జెండాలు
-