భారత వాతావరణ శాఖ(Indian Meteorology Department) ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు(Monsoons) దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. కేరళ తీరాన్ని తాకినట్లు అధికారికంగా తెలియజేసింది. అయితే తాము అంచాన వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని పేర్కొంది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా జూన్ 1వ తేదీనే రుతుపవనాలు(monsoons) కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు కారణంగా ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయని చెప్పింది. కాగా గతేడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న తీరాన్ని తాకాయి.
దేశ ప్రజలకు చల్లటి కబురు.. రుతుపవనాలు వచ్చేశాయి
-
Read more RELATEDRecommended to you
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
KTR | వాళ్లు రైతులు.. ఉగ్రవాదులు కాదు: కేటీఆర్
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector...
Jaishankar | మోదీతో భేటీ అంత ఈజీ కాదు: జైశంకర్
ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...