ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ సప్తగిరి(Comedian Saptagiri)కి టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకి తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు TDP నుంచి పోటీకి ఆఫర్ వచ్చిందని, మరో 10-15 రోజుల్లో గుడ్ న్యూస్ వస్తే వెల్లడిస్తానని వెల్లడించారు. తాను చంద్రబాబు అభివృద్ధి, విజన్ చూస్తూ పెరిగానని నటుడు సప్తగిరి అన్నారు. ఇటీవల పాదయాత్రలో లోకేశ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణతో ఎలా పేరు సంపాదించుకున్నానో.. రాజకీయాల్లోనూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు.
నటుడు సప్తగిరికి టీడీపీ నుంచి బంపర్ ఆఫర్.. పోటీకి రెడీ!!
-