టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ రెడ్డి ఎమోషనల్

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి(Kothakota Dayakar Reddy) మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మాజీ ఎమ్మెల్యే, నా ఆప్తుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి అకాల మరణం బాధాకరం. పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ రేవంత్(Revanth Reddy) ట్వీట్ చేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా తమ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నామని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు. టీడీపీ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read Also:
1. నటుడు సప్తగిరికి టీడీపీ నుంచి బంపర్ ఆఫర్.. పోటీకి రెడీ!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...