వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సెటైర్లు విసిరారు. ఇటీవల మీడియా సమావేశంలో రెండు చెప్పులు చూపిస్తూ పవన్ కల్యాణ్ కు పేర్ని నాని వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. దీనిపై జనసేనాని సెటైరికల్ గా స్పందించారు. తన చెప్పులను ఎవరో ఎత్తుకెళ్లారని, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలని తన అభిమానులకు చెప్పారు. పిఠాపురం సభలో ప్రసంగిస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నవరం సత్య దేవుడి దర్శనానికి వెళ్లినపుడు తన రెండు చెప్పులు ఎవరో ఎత్తుకెళ్లారని అన్నారు. ఆ చెప్పులు తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
చెప్పులు లేకుండా జుబ్బా వేసుకుంటే బాగుండదని బూట్లు వేసుకుని తిరుగుతున్నట్లు చెప్పారు. ఎవరు ఎత్తుకెళ్లారో మీకు తెలిస్తే చెప్పాలని, తన చెప్పులు తనకు ఇప్పించాలని అన్నారు. గుడి ముందు తాను వదిలిన చెప్పులను కూడా పట్టుకెళ్లిపోయేంతగా వైసీపీ(YCP) ప్రభుత్వం దిగజారిపోయిందని, ప్రభుత్వ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో సభాప్రాంగణం మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అరుపులు కేకలతో సభ ప్రాంగణం మార్మోగింది.
నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు. మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది. – JanaSena Chief Sri @PawanKalyan #VarahiVijayaYatra pic.twitter.com/aQ24qpOokC
— JanaSena Party (@JanaSenaParty) June 16, 2023