Guntur Kaaram | సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గిన మహేశ్ బాబు!

-

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో గుంటూరు కారం(Guntur Kaaram) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ సైతం విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచానలు పెంచేశాయి. అయితే.. తాజాగా.. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వరుసగా వాయిదా పడడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న గుంటూరు కారం(Guntur Kaaram) మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. అయితే సినిమాలో ముఖ్య నటుల కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈనెల 22కి వాయిదా వేశారు టీమ్. కాగా, లేటెస్ట్ సమాచారం మేరకు ఈ 22కు కూడా షూట్ ఉండకపోవచ్చని.. ఈ సమస్య ఇంకా అలానే ఉందని.. దీంతో ఈ సినిమా షూట్ జూలై మొదటి వారంలో షురూ కానుందని తెలుస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చని సోషల్ మీడియా టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో. అంతేగాక, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కోసం త్రివిక్రమ్(Trivikram) ఒక బలమైన పాత్ర రాశాడని టాక్. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్‌ను వేస్తున్నారు. ఆయన డేట్స్ కూడా కుదరాల్సి ఉండటంతో సినిమా అనుకున్న దానికంటే బాగా లేట్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. దీంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది.

Read Also:
1. డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ‘ఆదిపురుష్’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...