బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం(Prof Kodandaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రాజకీయాలు కార్పోరేట్‌గా మారాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నిరంకుశ పాలనను ప్రజల మీద రుద్దుతున్నారని.. అధికారాన్ని, డబ్బును ఉపయోగిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. తెలంగాణ జన సమితి(TJS)ని ఏ పార్టీలో విలీనం చేయడం లేదని.. ఈ పార్టీ తాను ఉన్నంతవరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్(KCR) తన ఆస్తులను పెంచుకోవడం కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 21 నుంచి యాత్ర చేస్తున్నానని.. తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తానని ఆయన(Prof Kodandaram) స్పష్టం చేశారు. ఉద్యమంలో తనతో పాటు కలిసి వచ్చిన అందరినీ ఏకం చేస్తామని వెల్లడించారు.
Read Also:
1. ప్రొఫెసర్ హరగోపాల్ కీలక నిర్ణయం
2. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే: బండి సంజయ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat