బాహుబలి సమోసా(Bahubali Samosa) తినే ఛాలెంజ్ కు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సిద్ధమవుతోంది. 12 కిలోల బరువైన బాహుబలి సమోసాను కేవలం 30 నిముషాల్లో తింటే.. ఏకంగా 71 వేల రూపాయలు గెలుచుకోవచ్చు. మీరట్ లోని కుషాల్ స్వీట్స్ సంస్థ యజమాని ఈ ఛాలెంజ్ పెట్టింది. పుట్టిన రోజున కేక్ బదులు సమోసా కట్ చేసే విధంగా ప్రోత్సహించేందుకు ఈ బాహుబలి సమోసా పోటీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రుచి, పౌష్టికాహార పదార్థాలతో తయారైన సాంప్రదాయ సమోసా పోటీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీ చూసైనా బాహుబలి సమోసాలను ఆర్డర్ చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.