చిన్నపిల్లల్లో ఐస్ క్రీమ్‌లకు ఉన్న డిమాండ్ ను కల్తీ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రమాదకర రసాయనాలతో కల్తీ ఐస్ క్రీములు(Ice Creams) తయారుచేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ SOT పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కాటేదాన్ లోని ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీలో తయారు చేస్తున్న ఐస్ క్రీమ్ లు ప్రమాదకరమైనవిగా గుర్తించి.. ఈ ముఠాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వీటిని తింటే పిల్లలు అనారోగ్యం బారిన పడటం ఖాయమని తెలిపారు. ఈ ఫ్యాక్టరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేవని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దీనిని నడుపుతున్నారని పేర్కొన్నారు. నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ఐస్ క్రీములకు ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్లోకి విక్రయిస్తున్నారని వెల్లడించారు.
Read Also:
1. కొండెక్కిన చికెన్ ధర.. కేజీ రూ.350
2. బాహుబలి సమోసా పోటీకి అంతా సిద్ధం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat