Avesh Khan |ఐపీఎల్‌లో అతిగా ప్రవర్తించా.. రియలైజ్ అయిన అవేశ్ ఖాన్

-

ఐపీఎల్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలిచిన ఆనందంలో అవేశ్ ఖాన్(Avesh Khan) హెల్మెట్ నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అతడు అతిగా ప్రవర్తించాడని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవేశ్ ఖాన్‌ ఆ సంఘటనపై స్పందించాడు. ఆ సమయంలో తాను కాస్త అతి చేశానని, అలా చేసి ఉండాల్సింది కాదని విచారం వ్యక్తం చేశాడు. ‘అప్పుడు అతిగానే చేశాను. ఆనందంలో అలా చేశాను. ఆ తర్వాత అలా ఎందుకు చేశానని బాధపడ్డా. అలా చేయాల్సింది కాదని రియలైజ్ అయ్యాను.’ అని తెలిపాడు. గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా భారత్‌‌కు ప్రాతినిధ్యం వహించిన అవేశ్ ఖాన్.. తిరిగి జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను జాతీయ జట్టులోకి తిరిగి వస్తానని అవేశ్ ఖాన్(Avesh Khan) ఆశాభావం వ్యక్తం చేశాడు.

- Advertisement -
Read Also:
1. నేను గుండానే అయితే.. కేసీఆర్ నా ఇంట్లో భోజనం ఎలా చేశారు: కొండా మురళి
2. తమిళ హీరోలపై నిర్మాతలమండలి రెడ్ నోటీస్!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...