మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఉపాసన(Upasana Konidela)ను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. రేపు ఉదయమే ఆమెకు డెలివరీ జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా ఉపాసన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకూ ఆమె ఇంటికి పరిమితం కాలేదు.
చాలా యాక్టివ్ గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విదేశాలు కూడా చుట్టేశారు. ఇదే విషయాన్ని మీడియా ఆమెతో ప్రస్తావించగా.. నేను నా ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తున్నాను, అందుకే ఇంత చురుకుగా పని చేస్తున్నాను అని సంతోషంగా తెలిపారు. కాగా ఆమె(Upasana Konidela)కు రేపు డెలివరీ జరగనుంది అనే వార్త బయటకి రావడంతో మెగా వారసుడు పుడతాడా? వారసురాలు పుడుతుందా అని అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read Also:
1. బేబీ పుట్టాక మావయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat