Adipurush Collections |బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా తొలి మూడ్రోజుల్లో రూ.340 కోట్ల గ్రాస్ సాధించిన ఆదిపురుష్.. నాలుగో రోజు కూడా భారీ వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ.375 కోట్ల కలెక్షన్లతో దుమ్ముదులిపింది. సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas), బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) కాంబోలో తెరెక్కిన మూవీ ఆదిపురుష్. ఈచిత్రాన్ని సుమారు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. టీ-సీరిస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహారించారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్ణణుడిగా సన్నీ సింగ్, సీతగా కృతి సనన్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న దాదాపు 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలో కూడా ఈ మూవీ భారీగా వసూళ్లను రాబట్టింది.
Read Also:
1. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
2. ప్రభాస్ ‘ఆదిరుపుష్’ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat