రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖ రాశారు. రూ.100కోట్ల విలువైన కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని.. ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబ్జాను అడ్డుకున్న NRI ఫ్యామిలీపై సాక్షాత్తూ హైకోర్టు పరిసరాల్లో హత్యాయత్నం, కిడ్నాప్ ఘటనకు పాల్పడటం దారుణమని తెలిపారు. ట్రస్ట్ భూముల కబ్జాకు, హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న NRI ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా తిరిగి NRIపైనే తప్పుడు కేసులు బనాయించడం ఏంటని అచ్చెన్నాయుడు(Atchannaidu) నిలదీశారు. నిందితులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also:
1. టిడ్కో ఇళ్లపై ప్రధాని ఫోటో లేకపోవడంపై కేంద్రమంత్రి ఆగ్రహం
2. ‘చంద్రబాబు మాటలు వినడం ఆపేయ్.. చిరంజీవిని నమ్ము’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat