బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే(Manikrao Thakre)అన్నారు. తెలంగాణలో బీజేపీతో వైరం అంటూ ఢిల్లీలో అమిషాను కేటీఆర్ కలుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు, బీజేపీకి లోపాయికారి ఒప్పందం లేకుంటే కల్వకుంట్ల కవితపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఠాక్రే ప్రశ్నించారు. కేసీఆర్ మహారాష్ట్రలో ఒక్కసీటు గెలిచినా రాజకీయాలు వదులుకుంటానని ఠాక్రే సవాల్ విసిరారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఠాక్రే(Manikrao Thakre) పాల్గొన్నారు. జులై 11, 12, 13, తేదీలో జరిగే యూత్ కాంగ్రెస్ ప్లీనరీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై యూత్ కాంగ్రెస్ ప్లీనరీలో చర్చిస్తామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన వారికి తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కరి చొప్పున పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఇంచార్జిలను నియమించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ఖరారు చేశామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్(Youth Congress)కు టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Read Also:
1. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి
2. వాహనదారులకు శుభవార్త.. త్వరలోనే చమురు ధరలు తగ్గింపు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat