Bhola Shankar Teaser | మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీజర్ విడుదల

-

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ సినిమా టీజర్‌(Bhola Shankar Teaser)ను మేకర్స్ విడుదల చేశారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah), కీర్తి సురేష్(Keerthy Suresh), సుశాంత్(Sushanth Anumolu) కీలక పాత్రలలో నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంది. అలాగే ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి మెహెర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్(Bhola Shankar Teaser).. ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. చిరు మార్క్ కామెడీతోపాటు.. మాస్ యాక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. “స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్” అంటూ చిరు చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Read Also:
1 .పవన్ కల్యాణ్ ఎవర్‌గ్రీన్ సినిమా ట్రైలర్‌ విడుదల (వీడియో)

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...