జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్రలో పవన్ బిజీబిజీగా పాల్గొన్నారు. ఒకవైపు రోడ్ షోలు, బహిరంగ సభలలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా పవన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం పర్యటనలోనూ పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి యాత్ర(Varahi Yatra)లో భాగంగా పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉపవాస దీక్షలో ఉన్నారు. దీంతో నీరసించిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) అనారోగ్యం కారణంగా ఉదయం 11 గంటలకు భీమవరం(Bhimavaram) నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన భేటి వాయిదా పడింది.
Read Also:
1. దళితబంధు సెకండ్ ఫేజ్‌లో వెనక్కి తగ్గిన సర్కార్!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat