తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో భారీగా నగదు ఖర్చు పెట్టింది అనే విమర్శలు వినిపించాయి.. కొందరు అప్పులు తెచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే మరికొందరు ఆస్తులు అమ్మి తనఖా పెట్టి ఎన్నికల్లో నిలబడ్డారు. అయితే టీడీపీ తరపున దాదాపు 80 శాతం మంది ఓటమి పాలయ్యారు.. దీంతో ఆర్దికంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు అనే చెప్పాలి.
తాజాగా ఓ టీడీపీ కీలక నేత ఎన్నికల్లో సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టాడట.. దీని కోసం అతని దగ్గర ఉన్న సుమారు2 కోట్లు లిక్విడ్ క్యాష్ ఖర్చు చేశాడట.. మిగిలింది అంతా అప్పులు తీసుకువచ్చి ఖర్చు చేశాడట. అయితే గతంలో తాను సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్ లో కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతైన విల్లా, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ అమ్మి ఆ అప్పులు తీర్చాడట. ఇంకా 1 కోటి రూపాయలు అప్పు ఉందట
మొత్తానికి ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలకు ఆర్ధికంగా భారీగా నష్టం వచ్చిందిఅనే టాక్ అయితే నడుస్తోంది. అయితే అప్పులు ఎగ్గొడితే రాజకీయ జీవితం సర్వనాశనం అవుతుంది అని అప్పులు తీరుస్తున్నాడట సదరు నాయకుడు