ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లోని నిబంధనలతో సమానంగా మెట్రో రైల్లో ఒక వ్యక్తి రెండు సీలు చేసిన ఆల్కహాల్ బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని ఢిల్లీ మెట్రో (DMRC Metro) స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా..? అని ఢిల్లీ మెట్రోను ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఢిల్లీ మెట్రో(DMRC Metro) స్పందిస్తూ.. రెండు సీల్డ్ ఆల్కహాల్ బాటిళ్ల వరకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని తెలిపింది. ఒకవేళ, ఎవరైనా ప్రయాణికుడు మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించినట్లయితే, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also:
1. మెగా ప్రిన్సెస్ పేరు అనౌన్స్ చేసిన మెగాస్టా్ర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat