Nellore | నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ సర్జన్ చేస్తోన్న యువతి హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీ(Narayana Medical College)లో ఆదివారం (జులై 2) చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య (23) అనే వైద్య విద్యార్థినికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె నెల్లూరు(Nellore)లోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ హౌస్ సర్జన్ చేస్తోన్న ఆమె ఆదివారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read Also:
1. యాత్ర-2 సినిమా విడుదల తేదీ ఖరారు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat