Telangana | ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సర్కార్ సూపర్ న్యూస్

-

Telangana | తెలంగాణ రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్‌లో సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో విద్యార్థులు ఎవరూ చేరకపోవడంతో సీట్లు వెనక్కి ఇచ్చి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను పెంచవల్సిందిగా కాలేజీలు అనుమతి కోరాయి. దీంతో కోర్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో 6,930 సీట్లకు తాజాగా అనుమతి లభించింది. దీంతో కొత్తగా మరో 7,635 ఇంజినీరింగ్ సీట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. తాజాగా అనుమతించిన అదనపు సీట్లతో ప్రభుత్వంపై ఏటా రూ.27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రం(Telangana)లో మొత్తం ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య l,00,671 చేరింది. కాగా, ఈనెల 8 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది.

Read Also:
1. TSPSC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఎందుకో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...