Praveen Kumar | భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ టీమిండియా మాజీ క్రికెటర్‌

-

భారత మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రవీణ్‌ కుమార్‌(Praveen Kumar) ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ ట్రక్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వాహనం కుదుపునకు లోనైంది. అయితే భారీ ప్రమాదం నుంచి కుటుంబంతో సహా క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రవీణ్‌కుమారే మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేవుని దయవల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా అందరం బయటపడ్డాం. మా అల్లుడిని ఇంటి దగ్గర దింపేందుకు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ట్రక్‌ మా కారును ఢీకొట్టింది. చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాం. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది’ అని అన్నాడు.

- Advertisement -
Read Also:
1. భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లీకి మళ్లీ నిరాశే!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...