SSC MTS Notification | కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 1500కు పైగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ , హవల్దార్ (సీబీఐసీ ; సీబీఎన్) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల
ఈ ఉద్యోగాలకు జులై 21వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు.
అభ్యర్థులు చివరి తేదీ వరకు ఎవరూ చూడొద్దని.. ముగింపు రోజుల్లో సర్వర్‌లో అధిక ట్రాఫిక్ కారణంగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడంలో సమస్యలు ఎదురు కావొచ్చని తెలిపింది.
ఇలాంటి సమస్యల్ని నివారించేందుకు ముందుగానే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
దరఖాస్తుల సమర్పణకు గడువు ఎట్టిపరిస్థితుల్లో పొడిగించబోమని తేల్చి చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్(SSC MTS Notification) ప్రకారం మొత్తం 1,558 ఉద్యోగాలకు గానూ.. 1,198 పోస్టులు మల్టీటాస్కింగ్ సిబ్బంది కాగా.. 360 పోస్టులు సీబీఐసీ, సీబీఎన్‌లో హవల్దార్ పోస్టులు ఉన్నాయి.
Read Also: టీమ్ ఇండియాకు హైదరాబాద్ కుర్రాడు.. తన రియాక్షన్ ఇదే
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat