Tilak Varma | టీమ్ ఇండియాకు హైదరాబాద్ కుర్రాడు.. తన రియాక్షన్ ఇదే

-

హైదరాబాద్‌కు చెందిన యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) టీమిండియా తుది జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వెస్టిండీస్ టూర్‌తో భారత జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా.. టీమిండియాకు ఎంపిక కావడంపై ఆయన స్పందించారు. ‘నేను ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్నాను. దీంతో రాత్రి వరకు నేను టీమిండియాకు ఎంపికైన విషయం తెలియలేదు. రాత్రి 8 గంటల సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పాడు.

- Advertisement -

వెంటనే మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. దీంతో వారు ఎమోషనల్‌ అయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కోచ్‌ సలాం బయాష్‌ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ముఖ్యంగా కీరన్ పొలార్డ్‌ చెప్పిన సలహాలు, సూచనలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని చెప్పుకొచ్చాడు తిలక్‌(Tilak Varma). కాగా, వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు తిలక్ ఎంపికయ్యాడు.

Read Also: ఆ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుంది!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...