Ravichandran Ashwin | అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డులు బద్దలు కొట్టిన అశ్విన్!

-

వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అదరగొడుతోంది. బౌలింగ్ సత్తా చాటిన బౌలర్లు కరేబియన్లను స్వల్ప 150 పరుగులకే ఆలౌట్ చేయగా.. తదుపరి బ్యాటింగ్‌ దిగిన టీమిండియా ఓపెనర్లు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం క్రీజులో కప్టెన్ రోహిత్ శర్మ(30), యశస్వి జైశ్వాల్(40) ఉన్నారు. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అదరగొట్టారు. అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అశ్విన్ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

- Advertisement -

ఈ క్రమంలో అశ్విన్(Ravichandran Ashwin) ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. ఇది అశ్విన్‌కు 33వ ఐదు వికెట్ల హాల్. ఇలా భారత్ తరఫున అత్యధిక సార్లు ఇలా ఐదు వికెట్ల ఘనత సాధించిన ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. విండీప్‌ ఓపెనర్లతోపాటు, ఆ టీం మిడిలార్డర్‌ను కూడా దెబ్బకొట్టాడు. డొమినికా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తన తొలి వికెట్‌గా టగనరైన్ చందర్‌పాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బౌల్డ్‌గా అత్యథిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 పైగా వికెట్లు తీసుకున్న మూడో భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (966), హర్భజన్ సింగ్ (711) అతని కన్నా ముందున్నారు.

Read Also: మీడియాపై మోహన్ బాబు దురుసు ప్రవర్తన

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...