కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోనాల వేడుకల్లో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు అని ఎద్దేవా చేశారు. ఏమైనా పబ్బులు, క్లబ్బులే తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని జగన్ ఆంధ్రాకు తీసుకెళ్లారని చెప్పారు.
చంద్రబాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్ ఉందని అన్నారు. ఉచిత కరెంట్‌పై చర్చకు రావాలని, ప్రజలే తీర్పు ఇస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం మొత్తం ఆర్ఎస్ఎస్‌దే అని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ రెడ్డి సిద్ధ హస్తుడు అని చెప్పారు. గాంధీ భవన్‌లో ఉన్న గాడ్సే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాన్షు(Himanshu) మాట్లాడిన మాటల్లో తప్పులేదని క్లారిటీ ఇచ్చారు. బాధ్యతగా ప్రతీ పాఠశాలను ప్రభుత్వమే బాగు చేస్తుందని ఆయన(KTR) హామీ ఇచ్చారు.