తెలుగుదేశం పార్టీకి ఈసారి వచ్చిన సీట్ల ప్రకారం ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం లేదు.. అయితే వచ్చే ఫిబ్రవరిలో ఏపీలో రాజ్యసభ పదవులు రానున్నాయి ,ఈసారి అన్నీ వైసీపీ వశం కానున్నాయి. అయితే పెద్దల సభకు పంపాలి అంటే పార్టీ అధినేతలకు ఎంతో దగ్గర వారినే పంపిస్తారు. గతంలో చంద్రబాబుని చూస్తే సుజనా, సీఎం రమేష్ ,టీజీ వెంకటేష్ ఇలా పారిశ్రామిక వేత్తలను పంపారు. మరి ఈ సారి జగన్ అధికారంలో ఉన్నారు.
దీంతో జగన్ దగ్గర కూడ పారిశ్రామిక వేత్తల లిస్ట్ చాలా ఉంది ..చంద్రబాబు కంటే సన్నిహితంగా పలువురు పారిశ్రామిక వేత్తలు జగన్ తో ఉంటారు. అందుకే ఓ ఫార్మా కంపెనీ అధినేత జగన్ దగ్గర నుంచి రాజ్య సభ సీటు పొందాలి అని చూస్తున్నారట.
అయితే ఏపీకి చెందిన ఆయన వైసీపీలో చేరి రాజ్యసభ సీటు పొందాలి అని తన మనసులో మాట ఓ కీలక నేతకు చెప్పారట. అయితే సామాజిక అంశాలు పరిశీలిస్తే ఆయన వర్గం కూడా రెడ్డి అవుతుంది.. మరి జగన్ ఈసారి బీసీకి రెండు ఓసీకి ఒకటి అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారు. మరి ఆయనకు రాజ్యసభ పదవి వస్తుందా లేదా అనేది చూడాలి.