తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు విద్యాశాఖ సమీక్షిస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపధ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని మంత్రి సబితా దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో రాష్ట్ర(Telangana) ప్రభుత్వం అన్నీ స్కూల్స్‌కు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. కాగా, వర్షాలతో రోడ్లపైకి వరదనీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు రోడ్లపైన కరెంట్ వైర్లు కూడా తెగిపడి జరగకూడనిది జరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అంతేగాక, సెలువులు ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.