వెస్డిండీస్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చెలరేగాడు. మొదటి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా సారధి.. రెండో టెస్టులో 80 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు Rohit Sharma (80), యశస్వి జైస్వాల్ (57) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ (10) వరుసగా రెండో టెస్టులోనూ చేతులెత్తేశాడు. ప్రతి బంతికీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే (8) కూడా మరోసారి నిరాశ పరిచాడు. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (87 నాటౌట్), రవీంద్ర జడేజా (36 నాటౌట్) ఈ జట్టును ఆదుకున్నారు. దీంతో రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 288/4 స్కోరుతో నిలిచింది. ఐదో వికెట్‌కు కోహ్లీ, జడేజా 100పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, గాబ్రియెల్, కీమర్ రోచ్, వారికన్ తలో వికెట్ తీసుకున్నారు.