Maharashtra | మహారాష్ట్రలో గురువారం రాయ్ గడ్ జిల్లాకు చెందిన ఇషాల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కొంతమంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. వారిని ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే దత్తత తీసుకోనున్నారు. 2 ఏళ్ళ నుండి 14 ఏళ్ళ లోపు పిల్లల సంరక్షణ బాధ్యతలు శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ చేసుకోనున్నట్లు శివసేన తెలిపింది. విద్య, ఇతర ఖర్చులకు శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చేందుకు ఫిక్స్డ్ డిపాసిట్ చేయనున్నట్లు సీఎం షిండే ఓఎస్డి మంగేష్ చివ్టే తెలిపారు. ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.